Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చిపోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 6.30గంటల సమయంలో జరిగినట్టు వారు తెలిపారు. అనంతరం వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఆలయ సాంప్రదాయరీతిలో పదిరోజుల్లో ధ్వజస్తంభం ప్రతిష్టించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.