What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication.
— Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021
Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO
Authorization

చిత్తూరు: ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన రెండు వేర్వేరు కంపెనీలైన హీరో, హోండా.. విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ నేపథ్యంలో తమ ఒంటరి ప్రయాణానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థకు చెందిన అతిపెద్ద లోగోను ప్రదర్శించి గిన్నీస్ రికార్డును నెలకొల్పింది. అదీ తమ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్న స్ల్పెండర్ ప్లస్ బైక్లను ఓ వరుస క్రమంలో పేర్చి లోగోను రూపొందించారు. దీనికి చిత్తూరు జిల్లాలోని హీరో తయారీ కేంద్రం వేదికగా నిలిచింది. మొత్తం 1000 ఫీట్ x 800 ఫీట్ స్థలాన్ని వినియోగించారు. 90 రోజులు ప్రణాళికలు వేసి, 300 గంటలు శ్రమించి ఈ లోగోను నిర్మించారు. మొత్తం 1845 బైక్లను హీరో లోగో ఆకారంలో పేర్చారు. ఇంత భారీ లోగోను ప్రదర్శించిన ఏకైక ద్విచక్రవాహన సంస్థగా రికార్డు నెలకొల్పింది.