Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు రాజ్యసభలో బుధవారం కంటతడి పెట్టారు. మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మెన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొందరు సభ్యులు పోడియం ఎదుట టేబుట్పైకి ఎక్కి ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మెన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు. ఈ ఘటనతో రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు బుధవారం కంటతడి పెట్టి గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు కూడా వణకుతూ కనిపించాయి. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ చైర్మెన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిదని.. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదన్నారు. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారని చట్టసభల పవిత్రను దెబ్బతీశారన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి తనకు నిద్ర పట్టలేని. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ సభ్యులను ఆయన కోరారు.