Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమిళ సినీ హీరో ఆర్య తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య విచారణకు హాజరయ్యాడు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. అయితే ఆమెను హీరో ఆర్య తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీ నుంచే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. దాంతో చెన్నెలో ఆర్యను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేసిన కోర్టు.. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్యను పోలీసులు విచారించారు. హీరో ఆర్య తెలుగులో 'వరుడు`, 'రాజా రాణి` మూవీలతో విలన్ గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.