Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇద్దరు మహిళలపై ఓ రిక్షా డ్రైవర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాశిక్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన నుంచి ఇద్దరు చిన్నారులు సహా ఓ వ్యక్తి బయటపడ్డట్టు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాశిక్ లోని షిండే నగర్ లో ప్రదీప్ ఓం ప్రకాశ్ గౌడ్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు.. మంగళవారం ఆయన అత్త భారతీ గౌడ ఇంటికి వచ్చారు. అయితే మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ప్రదీప్‌కు పరిచయం ఉన్న రిక్షా డ్రైవర్ సుఖ్‌దేవ్ గులాబ్ మెచేవాల్ ఆ ఇంటికి వచ్చి భారతీ గౌడ్‌ను కొడుతూ తిట్టాడు. ఈ క్రమంలోనే తాను తెచ్చిన రెండు బాటిళ్ల పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న భారతి గౌడ్, అమె సోదరి సుశీలపై విసిరాడు. దాంతో వారి శరీరానికి మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.