Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి: అన్నపురెడ్డిపల్లి ఫారెస్ట్ అధికారుల ఉన్మాదం తాజాగా వెలుగు చూసింది. కట్టుగూడెం గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వర్లుపై ఫారెస్ట్ సిబ్బంది దాడి చేసింది. ఫారెస్ట్ ప్లాంటేషన్లోకి గేదెలు వెళ్లాయన్న కారణంగా దాడికి పాల్పడ్డారు. బంధువులు వెళ్లేసరికి ప్లాంటెషన్లోనే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువులు, సీపీఐ ఆందోళనకు దిగింది. ఫారెస్ట్ సిబ్బందిపై హత్య కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని ధర్నా నిర్వహిస్తున్నారు.