Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి దాడిచేసిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. మాస్కు ధరించలేదని ఫైన్ వేసిన అధికారులపై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను వారు ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడి చేసింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని కొట్టింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.