Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్యం లభించి 75 ఏండ్లు పూర్తయ్యే సందర్భంలో అంటే 2022 ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2022 ఆగస్టు నాటికి నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ముగిసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం సమావేశాలపై మాట్లాడుతూ లోక్సభలో పరిణామాలు తనను బాధించాయన్నారు.రు. ఈ సమావేశాల్లో ఆశించిన విధంగా సభా కార్యక్రమాలు సాగలేదని అన్నారు. సమావేశాల్లో సభ కేవలం 21 గంటలే సజావుగా నడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాడక్టవిటీ 22 శాతమేనన్నారు. సభను సాఫీగా నడిపేందుకు తాను ప్రయత్నించానని, అందరికీ సమంగా అవకాశం ఇచ్చానని తెలిపారు. కానీ ఇంతకు ముందు సమావేశాలతో పోలిస్తే ఈ సారి సభ సరిగ్గా జరగలేదన్నారు.