Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవుబోతు నర్సింలు ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 25 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. ప్లాటు కొనుగోలు కోసం దాచి ఉంచిన డబ్బులు దొంగలు ఎత్తుకుపోయారు. చోరీ జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.