Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనంపై నిర్ణయం వెల్లడికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది.
హుస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 5న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పదో తేదీ లోపల తెలపాలని ఆదేశించింది. దాంతో అదే పిటిషన్‌పై మళ్లీ బుధవారం విచారణ జరగగా నిమజ్జనంపై నిర్ణయానికి మరో వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అయితే నిమజ్జనం, పండగ సందర్భంగా జనం గుమిగూడకుండా ప్రభుత్వ చర్యలు తెలపాలని హైకోర్టు పేర్కొంది. గతేడాది ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని చెప్పింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణను ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.