Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నూతనంగా వచ్చిన డిపార్ట్మెంట్లోకి వచ్చిన పొలీసులకు శిక్షణ కొనసాగుతుందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. బ్ల్యూ కోర్ట్, పెట్రోలింగ్ కారు డ్యూటీస్పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 60 పోలీస్ స్టేషన్లు పరిధిలో శిక్షణ ఇస్తున్నామన్నారు. వచ్చే 15 రోజుల్లో 2000 మంది పోలీసులకు శిక్షణ పూర్తి అవుతుందని చెప్పారు. బ్ల్యూ కోర్ట్స్, పెట్రోలింగ్ చేసే పొలీసులు 24 గంటలు పాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. పెట్రోలింగ్ చేసే పొలీసులకు వారి కారులో ఒక టాబ్ ఏర్పాటు చేసి ఉంటుందని తెలిపారు. హాక్ ఐ, క్రైమ్ అండ్ క్రిమిన్సల్ రికార్డ్ మొత్తం టాబ్లో పొందపరిచామన్నారు. జీపీఎస్ డివైస్ ద్వారా ఏ వెహికల్ ఎక్కడ ఉంది అనేది ట్రాకింగ్ జరుగుతుందన్నారు. దీంతో 24 గంటలు బ్ల్యూ కోట్స్ కి నేరస్తుల సమాచారం అందుబాటులో ఉండేలా టెక్నాలజీను ఉపయోగించి నేరస్తుల డేటా మొత్తం పొందుపరిచామని పేర్కొన్నారు.