Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్గా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ నియమితులయ్యారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఐదు నెలల కాలానికి గానూ టైట్ను బౌలింగ్ కోచ్గా నియమిస్తున్నట్టు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు బుధవారం తెలిపింది. అఫ్ఘనిస్తాన్ త్వరలో పాకిస్తాన్తో మూడు వన్డేల సిరీస్, ఆ తర్వాత శ్రీలంక పర్యటన, అనంతరం టీ20 ప్రపంచకప్లోపాల్గొననుంది. టీ 20 ప్రపంచకప్ తర్వాత నవంబర్ 27నుంచి హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్ కు అఫ్ఘనిస్తాన్ ఆడనుంది. దాంతో టైట్ కు ఇది సవాలే. టైట్ గాయం కారణంగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అనంతరం బిగ్ బాష్ లీగ్ లో ఒక టీంకు కోచ్ గా వ్యవహరించాడు.