Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈటల రాజేందర్ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఈటల రాజేందర్ గులాబీ జెండాను మోసం చేశారని ఆరోపించారు. ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిని చేసిన కేసీఆర్‌పై తీవ్ర పదాలు వాడుతున్నాడని చెప్పారు. ఆత్మగౌరవం అంటూ ఈటల ప్రజల వద్దకు వస్తున్నాడని..ఆత్మగౌరవం అంటే తాయిలాలు పంచడమా అని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు కనిపిస్తోందని, ఇంకా రెండున్నరేండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నింటిపై ధరలు పెంచిందన్నారు. ఈటల రాజేందర్ రైతుబంధు ఇవ్వొద్దని అంటున్నాడని కానీ మాత్రం రూ.10 లక్షలు తీసుకున్నాడని విమర్శించారు.
ఈటల దత్తత తీసుకున్న సిరిసేడును కూడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అలాగే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. తాము రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌లో పాఠశాలలను అభివృద్ధి, మహిళల కోసం రూ. 25 లక్షలతో మహిళా భవన్ నిర్మిస్తామని చెప్పారు.
'నీకు అక్షరాలు నేర్పి.. నాయకుడిగా తయారు చేసిన కేసీఆర్‌ను రా అని సంబోధించొచ్చా. అలాగే నన్ను పట్టుకొని ఓరేయ్ హరీశ్ అంటున్నాడు ఇది నీ సంస్కారం. . బీజేపీలో చేరాగనే నీ భాష మారింది. కానీ మేం మారం. నిన్ను మాత్రం ఈటల రాజేందర్ గారు అని పిలుస్తం.` అని ఈటలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు.