Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక యువకుడిని కొందరు కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటు కరెంట్ షాకులు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. సెహత్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్హియా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు పింటూ రాజ్భర్ అనే యువకుడి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం దారుణంగా కొట్టారు. అంతేగాక ఆ యువకుడికి కరెంట్ షాకులు కూడా ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన పింటూను అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. పింటూ సోదరుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు నలుగురు వ్యక్తులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.