Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆడపిల్లకు ఇంట్లోనే రక్షణ లేదనడానికి ఈ ఘటన మరో ఉదాహరణ. కన్న కూతురిపైనే ఓ తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం మల్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ పరిధిలోని ఒక గిరిజన తండాలో నివాసముంటున్న 15 ఏండ్ల బాలిక తన తల్లిదండ్రులతో పాటు కూలి పనికి వెళ్తోంది. అయితే కొన్ని రోజులుగా ఆ బాలికను ఆమె తండ్రే లైంగికంగా వేధిస్తున్నాడు. అది తట్టుకోలేని బాలిక 100 నంబర్‌కు డయల్ చేసి షీటీంకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడికి చేరుకుని బాలికను చేరదీసి వైద్య పరీక్షలు నిర్వహించి మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.