Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెదక్‌కు చెందిన బీజేపీ నేత, వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య, నిందితుల అరెస్టుపై జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మెదక్ పట్టణానికి చెందిన శివ, పవన్, నిఖిల్ కలిసి హత్య చేశారని తెలిపారు. శివను అదుపులోకి తీసుకున్నామన్నారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ముగ్గురితో పాటు హత్యలో ప్రమేయమున్న వారిని ఎవరినీ వదలిపెట్టమన్నారు. ఆర్థిక, వ్యాపార లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు నిందితుడు చెబుతున్నాడని చెప్పారు. కత్తితో గొంతుదగ్గర పొడిచి చంపారని, డేడ్ బాడీని ఏంచేయాలో తెలువక యశ్వంత్ రావ్పేట శివారులో డీజిల్ పోసి కారులోని డిక్కీలో ఉంచి నిప్పంటించారని తెలిపారు. పూర్తి ఏవిడెన్స్తో అందరిని అరెస్ట్ చేస్తామన్నారు. సుపారీ హత్య, వివాహేతర సంబంధం కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులకు ల్లా ఎస్పీ చందనాదీప్తి అభినందనలు తెలిపారు.