Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిండు గర్భిణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రసవించింది. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. అంబులెన్స్ ఈఎంటీ జాహిద్ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉండే సునందకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా గచ్చిబౌలి సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో ఈఎంటీ జాహిద్ అంబులెన్స్ డ్రైవర్ ప్రణయ్ సహకారంతో ప్రసవం చేశారు. సునంద మగబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వారిని తరలించినట్టు తెలిపారు.