Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అత్యవసర సమావేశం బుధవారం జరిగింది. ఈసందర్భంగా పలు కీలక తీర్మానాలను ఆమోదించినట్టు సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మమత అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల విభజన పై చర్చించారు. ఈసందర్భంగా చేసిన తీర్మానంలో జిల్లా, జోనల్, మల్లీజోనల్ ఉద్యోగుల విభజన చేపట్టబోయే ముందే నూతన జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని తద్వారా ఉద్యోగులకు అప్షన్ల ప్రక్రియ ద్వారా ఉద్యోగుల విభజన చేపట్టాలని తీర్మానించారు. ఉద్యోగుల విభజనకు ముందే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వారి వారి శాఖలకు సంబంధించి పోస్టులు అవసరానికి తగ్గట్టుగా ఖాళీ పోస్టులను గుర్తించి వాటి స్థానంలో నూతన పొస్టులను మంజూరు చేయాలని తీర్మానించారు. పీఆర్సీ వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సమావేశం తీర్మానించింది. జోనల్ క్యాడర్లో రిక్రూట్ అయిన వారు మల్టీజోనల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇక ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కూడా సమావేశంలో డిమాండ్ చేశారు. మరికొన్ని కీలక తీర్మానాలను కూడా ఈ సమావేశంలో ఆమోదించారు.