Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గోల్కొండ కోటలో చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం పరిశీలించారు. అక్కడే పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్డబీ, ఐడపీఆర్, సాంస్కృతిక, రెవెన్యూ శాఖల అధికారులతో వేడుక ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహారించి స్వాతంత్య్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు.