Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారీగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొందరు స్మగ్లర్లు గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా అరెస్ట్ చేశామని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసిల్దార్ షఫీయోద్దిన్ చిరాక్ పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. వారి కథనం ప్రకారం. జహీరాబాద్ మండలంలోని చిరాక్పల్లి సమీపంలో మాడ్గి చౌరస్తా వద్ద లారీలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి బియ్యం సీజ్ చేశామన్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అర్చన రావణుని పై కేసు నమోదు చేశామన్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ కు చెందిన పూజారి కిరణ్ కుమార్ రేషన్ బియ్యం తరలిస్తున్నారని తమ విచారణలో తేలిందన్నారు. పూజారి కిరణ్ కుమార్ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని కోఈర్ మండలం లోని దిగ్వాల్ పౌరసరఫరాల గోదాంలో నిల్వ చేశామన్నారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల అధికారులు సురేష్ కుమార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.