Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణా: అవినీతి ఆరోపణలతో చిల్లకల్లు ఎస్సై, కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఎస్సై కె.దుర్గా ప్రసాద్‌రావు, కానిస్టేబుల్ ఎం.శివరామకృష్ణ ప్రసాద్‌పై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో దొరికిన యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ వేధించారు. కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మనస్తాపంతో రాజమండ్రి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్పీ వీడియో తీసిన యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.