Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు శంకరమఠంలోని సాయి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 రోజుల పసికందు ఆసుపత్రి నుంచి రేపు ఉదయం డిశ్ఛార్జి కావాల్సి ఉంది. అనూహ్యంగా.. ఈరోజు సాయంత్రం పసికందు ఆసుపత్రి వెనక ఉన్న నీటితొట్టిలో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికిచేరుకుని విచారణ చేపట్టారు.