Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉన్నది. అయితే ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో ఉభయ సభలు సరిగా జరుగడం లేదు. పెగాసస్ వివాదం, రైతుల నిరసనలు, ఇతర సమస్యలపై చర్చ కోసం పట్టుబడుతూ, బిల్లుల ప్రవేశాన్ని అడ్డుకుంటూ సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లోక్సభ నిరవధిక వాయిదా పడగా, సాయంత్రం రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.