Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నారు. నియోజకవర్గానికి ఇప్పటికే పది వేల డబుల్ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన పేదలందరికీ కూడా త్వరలోనే డబుల్ ఇల్లు కట్టించి ఇస్తామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.