Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను లాక్ చేశామని ఢిల్లీ హైకోర్టుకు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. రాహుల్ షేర్ చేసిన లైంగికదాడికి గురైన తొమ్మిదేళ్ల దళిత బాలిక కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను, దానికి సంబంధించిన ట్వీట్ ను కూడా తొలగించామని కోర్టుకు వెల్లడించింది. ఆగస్ట్ 1న నైరుతి ఢిల్లీలోని ఓ శ్మశానవాటిక వద్ద బాలికను లైంగికదాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మృతురాలి తల్లిదండ్రులను రాహుల్ కలిశారు. తన కారులో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ట్వీట్, ఫొటోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాహుల్ ట్వీట్ కారణంగా లైంగికదాడికి గురైన బాలిక గురించి, ఆమె కుటుంబం గురించి అందరికీ తెలిసిపోయిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.