Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది. జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఇందుకు బుధవారం ఉదయం 3.43 గంటలకు రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాదిలోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా ఈఎస్ఓ-3 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది.