Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాప్రా పరిధి కేసీఆర్ కాలనీలో దాదాపు 130 అక్రమ నల్లా కనెక్షన్లను విజిలెన్స్ అధికారుల తనిఖీలో గుర్తించారు. దీంతో అసోసియేషన్‌కు చెందిన నలుగురు వ్యక్తులపై అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కాప్రాలోని కేసీఆర్ కాలనీ అధ్యక్షుడు దోమటి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, కోశాధికారి వెంకటేశం, కార్యదర్శిగా పరుశురామ్ అనుమతి లేకుండా కాలనీలో దాదాపు 130 అక్రమ నల్లా కనెక్షన్లు ఇప్పించారు. వాటర్‌బోర్డు ఆదాయానికి గండి కొట్టారు. వాటర్‌బోర్డు విజిలెన్స్ తనిఖీలలో విషయం బయటపడడంతో వారిపై అధికారులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేయించారు.