Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు.. భయపడిన యువకుడు భారీ మొత్తంలో డబ్బులు సమర్పించుకున్నాడు. హైదరాబాద్కు జంటకు దపదఫాలుగా మొత్తం రూ. 24 లక్షలు చెల్లించాడు బాధితుడు.. అయితే, వారి వేధింపులు ఆగకపోగా రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో పోలీసులను అశ్రాయించాడు బాధితుడు.. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.. భార్య భర్తలు జ్యోతి, వీర సతీష్ తో పాటు అబ్దుల్ రహీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. నిందితుల వద్ద నుండి రూ. 3,50,000 నగదు, ఒక ల్యాప్టాప్, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు.