Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బాదవత్ శ్రీనివాస్(30) తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. రెండేండ్లుగా దిగుబడి సరిగ్గా రాలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ. 2 లక్షలు ఎలా తీర్చాలన్న ఆందోళనతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబసభ్యులు లక్సెట్టిపేట హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కొడుకులున్నారు.