Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలిచిన నోముల భగత్ గురువారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గానికి గత ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో దివంగత నరసింహయ్య కుమారుడు నోముల భగత్ టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు.