Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు తరలివచ్చే ప్రజలు, ప్రముఖులు, మీడియా కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.