Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైతులకు జరుగుతున్న అన్యాయం.. వివరిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణూర్తి నటిస్తూ.. నిర్మించిన చిత్రమే రైతన్న అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ్ రెడ్డి అని అన్నారు. అన్నదాత బాధలు చెప్పడమే కాకుండా వాటికి పరిష్కారం చూపేలా ఈ సినిమా ఉందని వారు అన్నారు. గురువారం నటుడు నారాయణమూర్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్.నారాయ ణమూర్తి.. ప్రజలు, రైతుల బాధలు.. వాటికి పరిష్కారాలను చూపే ఎన్నో సినిమాలు తీశారన్నారు. అలాగే రైతన్న చిత్రం తీశారని, ఈ సినిమాను నిర్మించడానికి ఆయనచాలా కష్టపడ్డారన్నారు. రైతు ఆత్మహత్యలు.. గిట్టుబాటు ధర.. డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి పలు కీలక అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించినట్టు చెప్పారు. అందరిలో ఆలోచన రేకెత్తించే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న విడుదల అవుతోందన్నారు. ఈ చిత్రాన్ని ప్రజలంతా వీక్షించాలని మంత్రి కోరారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్నారు. ఈ చిత్రం ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతుందని చెప్పారు. ఇందులో నిర్మాత ఆశించింది ఏం లేదని, రైతుల కోసం.. ఓ రైతు పక్షపాతి తీసిన చిత్రం ఇది అని అన్నారు.
అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. గత 36 ఏండ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్టు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా నేను స్పందిస్తున్నానన్నారు. అర్ధరాత్రి స్వతంత్రం నుంచి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని.. ఈ నెల 14న తన 37వ సినిమా రైతన్న విడుదలవుతున్నదని చెప్పారు. అందరూ ఆదరించాలని కోరుకుంటు న్నాను అన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరెంటు చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలు అన్నారు. ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలిని ఆయన కోరారు. రైతుబంధుతో సీఎం కెసిఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని కొనియాడారు.