Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజస్థాలోని భిల్వారాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. క్వారీలో మైనింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలడంతో ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాలను తొలగించి ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అయితే, అక్రమంగా క్వారీలో మైనింగ్ నిర్వహిస్తున్న దుర్ఘటన చోటు చేసుకుంది. మైనింగ్‌పై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. రెండు నెలల కిందట అధికారులు దాడులు జరిపి.. ప్రొక్లయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయినా క్వారీలో అక్రమంగా తవ్వకాలు చేస్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకున్నది.