Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు నుంచి అభ్యంతరాలను, సూచనలు కోరుతూ ప్రభుత్వం ఒక నెల సమయమిచ్చింది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు సమీక్ష నిర్వహించారు.వరంగల్ రూరల్ జిల్లా నుంచి 41, వరంగల్ అర్భన్ జిల్లా నుంచి 92 అభ్యరంతరాలు, సూచనలు రాగా వాటిపై చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు.
2027.89 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 9,63,975 జనాభాతో వరంగల్ జిల్లాగా.. 1466. 23 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 8,35,420 జనాభాతో హన్మకొండ జిల్లాలను ప్రతిపాదించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మెన్ సుధీర్‌కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరితలు పాల్గొన్నారు.