Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగే యే కాకుండా తమిళ, హిందీ చిత్రరంగంలోనూ తనేంటో ప్రూవ్ చేసుకుంటోంది. అయితే తాజాగా ఆమె ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ సెషన్లో పాల్గొన్న లావణ్య తన అభిమానులతో మాట్లాడింది. తనను నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో తనకు ట్రిపోఫోబియా ఉందని చెప్పింది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను అని వివరించింది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుం టున్నట్టు చెప్పింది.