Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కృష్ణా బోర్డు చైర్మెన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపు అడ్డుకోవాలన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి, మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటి తరలింపు ఆపాలని కోరారు. అలాగే బనకచర్ల రెగ్యులేటర్ నుంచి కూడా నీటి తరలింపును ఆపాలని లేఖలో కోరారు.