Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తన హయాంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు.. టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచిచూసిన సందర్భాలకు చెక్ పెడుతూ.. ఫాస్ట్‌ట్యాగ్ లాంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.. అయితే.. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తామని వెల్లడించారు గడ్కరీ.. ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై టోల్ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు. ఇందుకు రాబోయే మూడునెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థ వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో లేదన్న నితిన్ గడ్కరీ.. టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్టు వెల్లడించారు.