Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమ్మెల్యే ఇంట్లో పార్క్ చేసిన రెండు కార్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన కర్నాటకలోని బొమ్మనహల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే సతీశ్ రెడ్డి ఇంటి ముందు రెండు కార్లు మహేంద్ర థార్, ఫార్చూనర్ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అయితే గురువారం తెల్లవారుజామున 1.25 నిమిషాలకు దుండగులు పెట్రోల్ క్యాన్లతో వచ్చి ఎమ్మెల్యే ఇంటి గేటును దూకి లోపలికి వచ్చారు. ఆ తర్వాత వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నట్టు డిప్యూటీ కమీషనర్ శ్రీనాథ్ మహాదేవ్ జోషి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీని పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన పై ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు బెంగుళూరు పోలీసులు గాలిస్తున్నట్టు చెప్పారు.