Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంత్రి హరీశ్ రావు పై ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అవి మోసపు మాటలని హుజూరాబాద్ ప్రజలకు తెలుసన్నారు. 2001 నుంచి ఇప్పటివరకు తన ఆస్తులపై, అలాగే వారి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ జరిపిం చాలని, ఎవరు సంపాదన ఏంతో తేలిపోతుందని సవాల్ విసిరారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్ధాంతపరమైన విమర్ళలు చేయాలన్నారు. తాను అభివృద్ది చేయలేదని మంత్రి అంటున్నారని కానీ నిన్న హరీశ్ రావు తిరిగిన రోడ్లు తాను వేయించినవేనని స్పష్టం చేశారు. మహిళల ఓట్ల కోసమే జీవోలు ఇచ్చే పని హరీశ్ రావుది అని విమర్శించారు.