Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సమగ్ర భూసర్వే పై ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అందుకు సర్వే ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని, అవసరమైన సాఫ్ట్వేర్ను తీసుకోవాలన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని చెప్పారు. తాను ప్రతీ నాలుగు వారాలకు ఒకసారి సమగ్ర సర్వే పై సమీక్ష చేస్తానన్నారు. అలాగే కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో కూడా దీనిపై సమీక్షచేస్తానని, వారానికి ఒకసారి మంత్రుల కమిటీ కూడా సమీక్ష చేయాలని చెప్పారు.