Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీఈ/బీటెక్ చేసినవారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఉద్యోగాలకు అర్హత బీఈ/బీటెక్ పూర్తి చేసినవారై ఉండాలి. అయితే ఏఐసీటీఈ లేదా భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2018 నవంబర్ 30లోగా ఈ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ షిప్ ట్రైనింగ్ అందుకుంటారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనుండగా.. మెకానికల్ విభాగంలో 20, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో 10, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11, 110 ను స్కాలర్ షిప్ గా అందించనున్నారు.
అర్హత
బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏఐసీటీఈ లేదా భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2018 నవంబర్ 30లోగా ఈ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థుల వయస్సు 2021 నవంబర్ 30లోగా 25 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.