Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. గురువారం హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆమె వెళ్లారు. అయితే ప్రారంభించిన అనంతరం ఆమె బయటకు వెళ్తుండగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను బయటకు తీసుకువచ్చారు. సుమారు అరగంట సేపు లిఫ్ట్ లో మేయర్ ఇరుక్కున్నారు. బయటకు వచ్చిన తర్వాత జరిగిన అసౌకర్యానికి మేయర్ కు ఆస్పత్రి సిబ్బంది క్షమాపణలు చెప్పారు.