Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లార్డ్స్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్ టాస్ కాస్త ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం 3:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్లో శార్దూల్ ఠాకుర్, ఇంగ్లాండ్లో బ్రాడ్.. గాయాల కారణంగా మ్యాచ్కు దూరమయ్యారు. శార్దూల్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
తుది జట్లు ఇవే.
భారత్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానె, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
ఇంగ్లాండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, సిబ్లే, జో రూట్, జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, జాస్ బట్లర్, సామ్ కరన్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్.