Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు చైనాలో విజృంభిస్తోంది. దాంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలను వారి ఇండ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్లు ధరించిన కొందరు వ్యక్తులు ప్రజల ఇంటికి వెళ్లి.. వారిని లోపలకి పంపి బయట నుంచి తాళం వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇనుపరాడ్లు పెట్టి సీల్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్ ఓపెన్ చేసి బయటకు వస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఏ అపార్ట్మెంట్లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్ చేస్తాం అని తెలిపారు.