Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 16,300 ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.25గా ఉంది. ఉదయం 54,669 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 318.05 పాయింట్ల లాభంతో 54,843.98 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82.10 పాయింట్ల లాభంతో 16,364.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి.