Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనాతో మృతి చెందారు. 1,575 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,56,627 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకు ఏపీలో 19,88,910 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే కరోనాతో మొత్తం 13,595 మంది ఏపీలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,54,53,520 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.