Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 13 మండలాలతో వరంగల్ జిల్లా, 14 మండలాలతో హన్మకొండ జిల్లా ఏర్పాటయ్యాయి.
జూన్ 21న పేర్ల మార్పుపై సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జిల్లాల పేర్లను మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.