Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసే ప్రత్యేక దర్శనం రూ. 300 టికెట్లను మార్ఫింగ్ చేసిన దళారులు ఒక్కొక్కటి రూ. 4 వేలకుపైగా ధరకు భక్తులకు విక్రయించినట్లు తెలిసింది. విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం కోసం రావాలనుకునే భక్తులు టీటీడీ అధికార వెబ్సైట్ నుంచే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ టికెట్ల దందా వెలుగు చూడటంతో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.