Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రోషన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. టైటిల్ గీతాన్ని (లిరికల్ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘పట్టుచీరల తళతళలు, పట్టగొలుసుల గలగలలు’ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం హుషారుగా సాగింది. పెళ్లిసందడి అంటే ఇదీ! అనేలా ఉంది. నాయకానాయికలతోపాటు చాలామంది సీనియర్ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేస్తున్నారు. రోషన్, శ్రీలీల డ్యాన్సు, కలర్‌ఫుల్ సెట్లు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. హేమచంద్ర, దీపు, రమ్య బెహర ఆలపించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రంతోనే నటుడిగా మారుతున్నారు. ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.