Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆడపిల్లలకు నేటి సమాజంలో కుటుంబ సభ్యుల నుంచే రక్షణ ఉండట్లేదు. సోంత వారి నుంచే లైంగికవేధింపులు దాడులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తమిళనాడులోని మడిపాక్కం ప్రాంతంలో ఏడేండ్ల బాలికపై తాత, మేనమామ లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని బాలిక తన సోదరుడికి చెప్పగా అతను సైతం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఆన్లైన్ క్లాసులకు హాజరవుతుండగా తల్లి ఇంటి పనులతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో బాలికను ఆమె తాతా తనతో పాటు మడిపాక్కంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆగస్ట్ 2న బాలిక రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో బాలికపై తాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై బాలిక మేనమామ సైతం బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక తన గోడును వరుసకు సోదరుడయ్యే అతనితో పంచుకుంది. ఆ 16 ఏండ్ల సోదరుడు కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అయితే బాలిక తల్లి తన కూతరును చూసేందుకు ఆదివారం అక్కడికి రాగా జరిగిన విషయం తెలిసింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిని వారు అరెస్టు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.